Breaking News

తెలుగు హీరోలకు ఎక్కువ పారితోషికం? దిల్‌ రాజు ఏమన్నారంటే?

Published on Sat, 03/30/2024 - 14:15

హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్‌. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అనిత సమర్పణలో దిల్‌రాజు, శిరీష నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 5వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు చిత్రయూనిట్‌ చైన్నెలోని ఒక హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో తమిళ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

త్వరలో తమిళ సినిమా చేస్తా
అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ఇటీవల తాను నటించిన ఖుషీ చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల మందుకు రానున్నామన్నారు. గీతగోవిందం చిత్రం తరువాత పరశురామ్‌ దర్శకత్వంలో తాను నటించిన చిత్రం ఇదని చెప్పారు. మంచి కుంటుంబ కథా చిత్రంగా ఈ ఫ్యామిలీస్టార్‌ ఉంటుందన్నారు. తదుపరి గౌతమ్‌ తిన్నూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. త్వరలోనే తమిళ చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. పలువురు దర్శకుల కథలు వింటున్నట్లు చెప్పారు.

తెలుగు హీరోలకు ఎక్కువ పారితోషికం?
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు విజయ్‌ హీరోగా నిర్మించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని సాధించిందని, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ఫ్యామిలీస్టార్‌ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. పేద, గొప్ప ప్రతి ఇంట్లోనూ ఒక ఫామిలీస్టార్‌ ఉంటారని, అలాంటి కథే ఈ చిత్రం అన్నారు. ఇప్పటి వరకూ విజయ్‌ దేవరకొండను రౌడీస్టార్‌ అని అంటున్నారని, ఈ చిత్రం తరువాత ఫ్యామిలీస్టార్‌ అంటారని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో థింక్స్‌ స్టూడియోస్‌ తరుణ్‌ విడుదల చేస్తున్నారని చెప్పారు. తెలుగులో హీరోలకు అధిక పారితోషికం ఇస్తారనే విషయాన్ని తాను అంగీకరించనని, దేనికైనా ఒక లెక్క ఉంటుందని, దాన్ని బట్టే పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు.

చదవండి: డేనియల్‌ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)