Breaking News

'పుష్ప' విలన్ క్రేజీ మూవీ.. 'ఆవేశం'తో హిట్ కొట్టాడు

Published on Fri, 04/12/2024 - 08:27

సంక్రాంతి తర్వాత తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. చాలావరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అద్భుతమైన హిట్ గా నిలిచింది మాత్రం 'టిల్లు స్క్వేర్'నే. మరోవైపు మలయాళ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వరసపెట్టి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్)

ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్.. రీసెంట్ టైంలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాల గురించి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర రిలీజైతే చూసి ఆదరించడంతో పాట కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా ఒకటి చేరింది. 'ఆవేశం' అనే పేరున్న సినిమాతో హిట్ కొట్టేశాడు. తాజాగా మలయాళంలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

'ఆవేశం' కథ విషయానికొస్తే.. బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సిటీలో పేరుమోసిన రౌడీ అయిన రంగాని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఇందులో రంగాగా చేసిన ఫహాద్ ఫాజిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే రిలీజైన ఈ చిత్రంపై ఆల్రెడీ  తెలుగు నిర్మాతల దృష్టి పడిందట. 'పుష్ప'తో ఫహాద్ కి ఆల్రెడీ తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి త్వరలో 'ఆవేశం' రిలీజ్ పక్కా ఉంటుందట.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)