Breaking News

ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా!

Published on Wed, 06/25/2025 - 13:05

దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ (Sajid Khan) సెట్‌లో తనను ఇ‍బ్బంది పెట్టాడంటోంది బాలీవుడ్‌ బ్యూటీ ఈషా గుప్తా (Esha Gupta). సాజిద్‌ డైరెక్ట్‌ చేసిన హమ్‌షకల్‌ (2014) మూవీలో ఈషా హీరోయిన్‌గా నటించింది. ఆనాటి చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నన్నెవరైనా చులకనగా చూస్తే అస్సలు ఊరుకోను. అలాంటిది సాజిద్‌ నన్ను సెట్‌లోనే తిట్టేవాడు. నేనెందుకు ఊరుకుంటాను? తిరిగి ఇచ్చిపడేసేదాన్ని. కొంతమందికి ఆలోచన తక్కువ.. ఫ్రస్టేషన్‌ ఎక్కువుంటుంది. 

సారీ చెప్పడంతో వెళ్లా..
ఈయన పదేపదే కోప్పడుతుండేవాడు. ఎంతవరకని భరిస్తాం? అప్పటికే సినిమాను కష్టపడి ప్రమోట్‌ చేశాం. అయినా కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందరిపైనా అరుస్తూ తన పరువు తనే తీసుకునేవాడు. ఓరోజు ఆయన వైఖరిపై కోపమొచ్చి నేరుగా కారెక్కి ఇంటికి వెళ్లిపోయాను. ఆ సినిమానే వదిలేయాలనుకున్నాను. కానీ నిర్మాత వాసు భగ్నానీ పిలిచి సారీ చెప్పడంతో వెళ్లాను. దర్శకుడు సాజిద్‌ కూడా క్షమాపణలు చెప్పాడు.. కానీ నా మనసులో మాత్రం ఆయన్ను క్షమించలేకపోయాను అని చెప్పుకొచ్చింది. 

సినీ జర్నీ
హమ్‌షకల్‌ మూవీలో సైఫ్‌ అలీ ఖాన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, రామ్‌ కపూర్‌ హీరోలుగా నటించారు. తమన్నా భాటియా, బిపాషా బసు, ఈషా గుప్తా కథానాయికలుగా యాక్ట్‌ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. ఈషా గుప్తా సినీజర్నీ విషయానికి వస్తే.. 'జన్నత్‌ 2' (2012) చిత్రంతో కెరీర్‌ ప్రారంభించింది. తెలుగులో వీడెవడు మూవీ చేసింది. వినయ విధేయ రామలో 'ఏక్‌ బార్‌ ఏక్‌ బార్‌..' అనే ఐటం సాంగ్‌లో యాక్ట్‌ చేసింది. చివరగా 'వన్‌ డే: జస్టిస్‌ డెలివర్‌డ్‌' మూవీలో డీసీపీ లక్ష్మీగా నటించింది. ప్రస్తుతం ప్రైవేట్‌ సాంగ్స్‌లో కనిపిస్తోంది.

చదవండి: హార్దిక్‌తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)