Breaking News

ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లపైనే.. ఆ సీన్లలో సిగ్గెందుకు?

Published on Sat, 04/12/2025 - 16:12

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌ ప్రపంచం. పాత్ర డిమాండ్‌ చేస్తే నచ్చకపోయినా సరే ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించాల్సిందే. తెరపై రొమాన్స్‌ చేస్తున్నప్పడు ఒక్కోసారి హీరోయిన్లు చాలా ఇ‍బ్బందిగా ఫీల్‌ అయిన సందర్భాలు ఉంటాయి. అయితే, వాటిని బహిరంగంగా హీరోయిన్స్‌ చెప్పుకోలేరు. అయితే, బాలీవుడ్‌కు చెందిన ఈషా గుప్తా ఒక వెబ్‌ సిరీస్‌లో ఇంటిమేట్‌ సీన్‌ చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని బాలీవుడ్‌ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

2012లో జన్నత్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా గుప్తా(Esha Gupta) తెలుగులో    'వినయ విధేయ రామ' మూవీలోని పాటలో సందడి చేసింది. అయితే, ఆశ్రమ్ సీజన్ 3 (2022) వెబ్‌ సిరీస్‌లో సోనియాగా మెప్పించిన ఈ బ్యూటీ.. బాబీ డియోల్‌తో(Bobby Deol) ఒక ఇంటిమేట్‌ సీన్‌లో దుమ్మురేపింది. తాజాగా ఆ సీన్‌ గురించి ఇలా చెప్పింది.  'బాబీ డియోల్‌తో ఇంటిమేట్‌ సీన్‌ చేయడం నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. చాలా ఇష్టంతోనే చేశాను. అలాంటి సీన్స్‌ చేయడంలో ఎందుకు సిగ్గు ఉంటుంది. 

అప్పటికే పదేళ్ల పాటు చిత్రపరిశ్రమలో ఉన్నాను. ​పరిణతి చెందిన వ్యక్తులతో ఎలాంటి సీన్స్‌ చేసినా  సమస్య ఉండదు. బాబీ డియోల్‌ అప్పటికే అలాంటి రొమాన్స్‌ సీన్స్‌ చేసి ఉంటాడు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన కూడా గతంలో కంటే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. కథ మేరకు మాత్రమే ఆయన నాతో సన్నిహితంగా నటించాడు. తనని తాను ఎలా కంట్రోల్‌ చేసుకోవాలనేది బాబీ డియోల్‌కు తెలుసు.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆశ్రమ్‌ వెబ్‌ సిరీస్‌లో బాబీతో ఉన్న ఇంటిమేట్‌ సీన్లను చూసిన వారు తనను సమర్థించగలరని ఆశిస్తున్నానని చెబుతూ ఆ ఇంటర్వ్యూను ఈషా ముగించింది.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)