Breaking News

థియేటర్లో అసభ్య ప్రవర్తన.. వెంటనే చేయి పట్టుకుని: హీరోయిన్

Published on Sun, 09/15/2024 - 09:43

బాలీవుడ్ నటి ఇషా డియోల్ పరిచయం అక్కర్లేని పేరు. హేమమాలిని వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురే ఇషా. కేవలం 21 ఏళ్ల వయసులోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్‌ చిత్రాల్లో నటించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇషా.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. పుణేలో తాను నటించిన దస్‌ మూవీ ప్రీమియర్ షోలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. అందరితో పాటు నేను కూడా ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లాను.. అదే సమయంలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని ఇషా వెల్లడించింది. దీంతో వెంటనే అతన్ని చేయి పట్టుకుని లాగి అక్కడే చెంపదెబ్బ కొట్టానని.. ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించవద్దని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది. నా చుట్టూ బౌన్సర్లు ఉన్నప్పటికీ ఇలా జరిగిందని పేర్కొంది. కాగా.. ఈషా చివరిసారిగా హంటర్ టూటేగా నహీ తోడేగా అనే షోలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్  హీరో హీరోయిన్ అనే చిత్రంలో కనిపించనుంది.

భర్తతో విడాకులు

కాగా.. హీరోయిన్‌ ఈషా డియోల్‌ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంది. 2012లో భరత్‌ తక్తానీని పెళ్లి చేసుకున్న ఈమెకు రాధ్య, మిరాయ అని ఇద్దరు కూతుర్లున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు ప్రకటించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి