నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు: కంగనా రనౌత్‌

Published on Tue, 09/03/2024 - 01:15

‘‘నేనెంతో ఆత్మగౌరవంతో ఈ సినిమాని రూపొందించాను. కత్తెర లేని వెర్షన్‌నే రిలీజ్‌ చేయాలని నిశ్చయించుకున్నాను. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. అన్‌కట్‌ వెర్షన్‌నే విడుదల చేస్తాను’’ అని కంగనా రనౌత్‌ అన్నారు. కంగనా రనౌత్‌ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. గత ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.

ఈ నెల 6న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్‌ సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌ మాట్లాడుతూ– ‘‘నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది ఘోరమైన పరిస్థితి. మన దేశం విషయంలో చాలా నిరాశగా ఉన్నాను. ఓటీటీలో హింస, అశ్లీలం వంటివి చూపించినా అభ్యంతరం చెప్పరు. ఓటీటీకి అంత స్వేచ్ఛ ఉంది.

నా సినిమా విషయంలో ఇందిరా గాంధీ హత్యను చూపించకూడదనీ, భింద్రన్‌వాలేను చూపించవద్దనీ, పంజాబ్‌ అల్లర్లను చూపించవద్దనే ఒత్తిడి ఉంది. ఇవేవీ చూపించొద్దంటే ఇక చూపించడానికి ఏం మిగిలి ఉంటుందో?  కొన్ని సినిమాలు రూపొందించడానికి కొందరికి మాత్రమే సెన్సార్‌షిప్‌ ఉంటుంది’’ అని ఘాటుగా స్పందించారు.

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)