Breaking News

గొడ్రాలిని చేసి పిచ్చిదానిగా చిత్రీకరించాడు: నటుడిపై మూడో మాజీ భార్య ఆరోపణలు

Published on Sat, 02/22/2025 - 21:33

మలయాళ నటుడు బాలా (Actor Bala) గతేడాది కోకిలను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ జంటగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్‌లో ఈ జంటను ఆశీర్వదిస్తూ అతడి మాజీ భార్యపై అనుచిత కామెంట్లు చేశారు. బాల రెండో మాజీ భార్య, డాక్టర్‌ ఎలిజబెత్‌ నటుడిని ప్రలోభపెట్టిందని, అతడు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు బాలాను వశం చేసుకుందని ఆరోపించారు. ఒకవేళ రోగి ప్రపోజ్‌ చేసినా డాక్టర్‌గా దాన్ని అంగీకరించకూడదు. కానీ ఆమె నటుడిని వశపరుచుకుంది. ఇది వైద్య వృత్తికే కళంకం అని కామెంట్స్‌ చేశారు. దీనిపై ఎలిజబెత్‌ ఘాటుగా స్పందించింది.

అంత డబ్బు లేదు
నిజంగా నేనలా చేసుంటే నాపై ఫిర్యాదు చేయొచ్చుగా! నేను అతడిని బెదిరించానా? ఇలాంటి ప్రచారం చేయించేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. రాజకీయ నాయకుల సపోర్ట్‌ అసలే లేదు. అంతెందుకు, ఒకసారి నువ్వు నాపై అత్యాచారం చేశాక.. ఇంటికి తీసుకెళ్లండంటూ చెన్నైలోని ఓ పోలీసాఫీసర్‌ నా పేరెంట్స్‌కు ఫోన్‌ చేశాడు. చచ్చిపోదామని ప్రయత్నించాను. నేను నీ భార్య కాదని చెప్తున్నావు. అలాగైతే నా అనుమతి లేకుండా నువ్వు చేసిన పనిని ఇంకేమంటారు? జనాలు నా గురించి నోటికొచ్చింది వాగుతున్నప్పుడు నేను నోరు విప్పక తప్పడం లేదు.

పిచ్చిదాన్నని ప్రచారం..
నేను నిజాల్ని వెల్లడిస్తూ పోస్ట్‌ పెట్టడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను చట్టపరంగా ముందుకు వెళ్లాలన్నా కూడా గతంలో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తారు. నేను ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు. నాకు మానసిక స్థితి సరిగా లేదని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ పోస్ట్‌ను సాక్ష్యంగా పెట్టుకోండి అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది.

చిత్రహింసలు
మరో పోస్ట్‌లో.. బాలాను నేను ఫేస్‌బుక్‌లో కలిశాను. అతడు నాతో రిలేషన్‌లో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో చేసిన చాటింగ్‌, వాయిస్‌ రికార్డింగ్స్‌ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. పోలీసుల ఎదుట మా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి అతిథులు కూడా వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎలా పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. నా కుటుంబాన్ని కూడా వేధించాడు. తన గురించి చెప్తే వదిలిపెట్టనని గూండాలతో హెచ్చరించాడు. మా బెడ్‌రూమ్‌ వీడియో లీక్‌ చేస్తానని బెదిరించాడు. 

అమ్మాయిలతో ఆడుకున్నాడు
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ట్యాబ్లెట్స్‌ వేసుకున్నాను. నన్నే కాదు చాలామంది అమ్మాయిలను మోసం చేశాడు. ఇదంతా టైప్‌ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేను గొడ్రాలినని అందరి ముందు నానా మాటలన్నాడు అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. కాగా బాలా సినీ నేపథ్యానికి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తాతయ్యకు అరుణాచల స్టూడియో ఉండగా తండ్రి 350కు పైగా సినిమాలు డైరెక్ట్‌ చేశాడు. బాలా సోదరుడు శివ కంగువా సినిమాను డైరెక్ట్‌ చేశాడు. 

బాలా పర్సనల్‌ లైఫ్‌
బాలా 2మచ్‌ అనే తెలుగు సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఇతడు చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులిచ్చేసి అమృతా సురేశ్‌ను పెళ్లాడాడు. ఆమెతోనూ విడిపోయిన తర్వాత డాక్టర్‌ ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నాడు. చివరకు ఆమెను కూడా వదిలేసి ఇటీవలే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)