Breaking News

OTTకి బదులుగా రక్షిత్ శెట్టి కొత్త ప్లాన్‌.. జులైలో 'ఏకం' విడుదల

Published on Tue, 06/18/2024 - 15:21

777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్‌ సీరిస్‌ విడుదల కానుంది. ఈ సీరిస్‌ను విడుదల చేసేందుకు సుమారు 3 ఏళ్ల నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో రక్షిత్ శెట్టి ఒక సొంత ప్లాట్‌ఫామ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

ఏడు కథలతో ఏకం వెబ్‌ సీరిస్‌ను మేకర్స్‌ నిర్మించారు. జులై 13 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే, ఈ చిత్రాన్ని చూసేందుకు www.ekamtheseries.com వెబ్‍సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.149 చెల్లించి ఏకం వెబ్‌ సిరీస్‌ను చూడొచ్చు. ఇదే విషయాన్ని రక్షిత్ శెట్టి అధికారికంగా ప్రకటించారు.

రక్షిత్ శెట్టి నిర్మించిన ఏకం వెబ్ సిరీస్‍లో ప్రకాశ్ రాజ్, షైన్ శెట్టి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఏకం వెబ్ సిరీస్ కన్నడలో మాత్రం అందుబాటులో ఉంది. ఈ సిరీస్‍ను ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకోకపోవడంతోనే ఇలా సొంతంగా ఒక వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేస్తున్నట్లు రక్షిత్‌ శెట్టి తెలిపాడు. చూడాలనే ఆసక్తి ఉన్నవారు జులై 13 నుంచి రూ.149 చెల్లించి ఏకం ప్రపంచంలోకి అడుగుపెట్ట వచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)