తెలుగులో నటించడానికి రెడీ:  దుషారా విజయన్‌

Published on Mon, 05/22/2023 - 08:58

తమిళ సినిమా: రాజకీయ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్‌ దుషారా విజయన్‌. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్‌ దృష్టిలో పడ్డారు. అలా ఆయన నిర్వహించిన ఆడిషన్‌లో సెలెక్ట్‌ అయ్యి సార్పట్టా పరంపరై చిత్రంలో కథానాయకగా నటించారు. అందులో నటుడు ఆర్యకు జంటగా మరియమ్మ అనే పాత్రను పోషించారు. ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి యువతగా ఆ పాత్రకు జీవం పోసి అందరి ప్రశంసలను అందుకున్నారు.

ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్‌నే రూపొందించిన నక్షత్రం నగర్గిరదు చిత్రంలోని నటించారు. ప్రస్తుతం కళువేత్తి మూర్కన్, అవినీతి, నటుడు అర్జున్‌దాస్‌ సరసన ఒక చిత్రం అంటూ మూడు, నాలుగు చిత్రాలు దుషారా చేతిలో ఉన్నాయి. వీటిలో అరుళ్‌ నిధికి జంటగా నటించిన కళువేత్తి మూర్కన్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26వ తేదీన తెరపైకి రావడానికి  సిద్ధమవుతోంది. ఎస్‌.అంబేత్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు.

(చదవండి: కమల్‌ హాసన్‌ ఖాతాలో మరో అరుదైన అవార్డు)

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నటి దుషారా విజయన్‌ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ కళువేత్తి మూర్కన్‌ తనకు స్పెషల్‌ చిత్రమని పేర్కొన్నారు. నటుడు అరుళ్‌ నిధితో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అయితే ఆయన సెట్‌లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని అన్నారు. తాను ఇందులో కవిత అనే బ్యాంక్‌ ఉద్యోగి పాత్రలో నటించినట్లు చెప్పారు.

(చదవండి: ప్యాలెస్‌లో శర్వానంద్‌ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?)

చిత్రంలో అరుళ్‌ నిధితో కలిసి నటించిన రొమాన్స్‌ సన్నివేశాలు డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. దర్శకుడు పా..రంజిత్‌ సార్పట్టా పరంపరైకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందనీ అదే జరిగితే అందులో తానే నటిస్తానని చెప్పారు. తాను నట జీవితం సార్పట్టా పరంపరై చిత్రంలోని మరియమ్మ పాత్రకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా మారిందన్నారు. తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉందనీ అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పారు.   

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)