Breaking News

లక్కీ భాస్కర్‌ తర్వాత 'దుల్కర్‌ సల్మాన్‌' చేతిలో రెండు సినిమాలు

Published on Sun, 01/05/2025 - 08:35

లక్కీ భాస్కర్‌తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్‌ సల్మాన్‌.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్‌ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది.  పవన్‌ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్‌ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో  కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండగా.. సుజిత్‌ సారంగ్‌ కెమెరామెన్‌గా వ్యహరించనున్నట్లు తెలిసింది.  

దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.

ఇక  ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్‌ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్‌. మరి... దుల్కర్‌–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే.  తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్‌ పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)