Breaking News

ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్

Published on Sat, 08/19/2023 - 18:29

సీతారామం సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు.  'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు.   

(ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్‌ చెంప చెళ్లుమనిపించా: నటి)

దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. 

కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు.  ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఇందులో రాజ్‌కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది.

(ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)