Breaking News

రామ్‌ బతికే ఉన్నాడా? సీతారామం సీక్వెల్‌!

Published on Wed, 01/28/2026 - 12:08

నాలుగేళ్ల క్రితం వెండితెరపై తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం సీతారామం. దుల్కర్‌ సల్మాన్‌ లెఫ్టినెంట్‌ రామ్‌గా.. మృణాల్‌ ఠాకూర్‌ సీతామహాలక్ష్మిగా ఒదిగిపోయారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ 2022లో విడుదలై క్లాసిక్‌ హిట్‌ అందుకుంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌ మళ్లీ రాబోతోందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. 

కాంబినేషన్‌ రిపీట్‌?
ఈ మేరకు ఓ ఫోటో వైరల్‌ అవుతోంది. అందులో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌.. వర్షంలో ఒకే గొడుగు కింద నిల్చుని ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇది చూసిన అభిమానులు సీతారామం మూవీకి సీక్వెల్‌ రాబోతోందా? అని చర్చ మొదలుపెట్టారు.. మొదటి పార్ట్‌లో రామ్‌ మరణించడంతో కథ ముగుస్తుంది. మరి పార్ట్‌ 2లో రామ్‌ బతికే ఉంటాడా? ఎలా చూపిస్తారు? అన్న ఆసక్తి అందరిలో మొదలైంది.

సీక్వెల్‌?
గతంలో సీతారామం సీక్వెల్‌ గురించి దుల్కర్‌ మాట్లాడుతూ.. క్లాసిక్‌గా నిలిచిన సినిమాలను మళ్లీ టచ్‌ చేయకూడదనే విషయాన్ని నేను నటుడిని కాకముందే తెలుసుకున్నా.. సీతారామం సినిమాను ప్రేక్షకులు హృదయాల్లో దాచుకున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉండదనుకుంటున్నాను అన్నాడు. మరి ఈ పోస్టర్‌ దుల్కర్‌-మృణాల్‌ల కొత్త సినిమానా? లేదా సీతారామం సీక్వెలా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే వెండితెరపై మ్యాజిక్‌ జరగడం ఖాయం అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

 

 

చదవండి: మేలో దేవర 2 స్టార్ట్‌

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)