Breaking News

దుల్కర్‌ తన రోడ్డు తాను వేసుకున్నాడు: దర్శకుడు త్రివిక్రమ్‌

Published on Mon, 10/28/2024 - 00:28

‘‘మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్‌. ‘మహానటి, సీతారామం’ సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్‌ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్‌ మై ఫేవరెట్‌ యాక్టర్స్‌ విజయ్‌ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్‌.. చాలా గట్టివాడు’’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. దుల్కర్‌ సల్మాన్స్  టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’.

ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్‌ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్‌’ సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్‌ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను. 

ఆ అడ్వెంచర్‌ను వెంకీ సక్సెస్‌ఫుల్‌గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్‌ నుంచి బయటకు వస్తారు’’ అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత నాకు ఫస్ట్‌ చెక్‌ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నుంచి వచ్చింది. త్రివిక్రమ్‌గారు పిలిపించి, మాట్లాడి చెక్‌ ఇప్పించారు. సితారలో ఇప్పుడు ‘వీడీ 12’ సినిమా చేస్తున్నాను. ‘లక్కీ భాస్కర్‌’ను వెంకీ బాగా తీశాడనిపించింది. ‘మహానటి, కల్కి 2898 ఏడీ’ సినిమాలో నేను, దుల్కర్‌ నటించాం. కానీ స్క్రీన్స్  షేర్‌ చేసుకోలేదు. ‘లక్కీ భాస్కర్‌ బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ– ‘‘నాకు నచ్చిన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ ఒకటి. త్రివిక్రమ్‌గారి రైటింగ్‌లో మంచి డెప్త్‌ ఉంటుంది.

విజయ్‌ నా లక్కీ చార్మ్‌. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘మహానటి’ ఈవెంట్‌లో ఇతను దుల్కర్‌ అంటూ ఆడియన్స్ కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ ఈవెంట్‌లో ఉన్నాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్‌’ ఈవెంట్‌లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్‌లోని పాత్రలు మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు దుల్కర్‌ సల్మాన్స్ . ‘‘బ్యాంకింగ్‌ వరల్డ్‌పై సినిమా తీయాలని ‘లక్కీ భాస్కర్‌’ తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)