Breaking News

ఆ పదం నాకు పెద్దగా నచ్చదు

Published on Mon, 08/14/2023 - 04:34

‘‘మనందరం ఇప్పుడు పాన్  ఇండియా మూవీస్‌ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్‌ ఇండియా యాక్టర్‌ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్‌ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్‌ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్‌ కోసం స్క్రిప్ట్‌ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు.

ఓ పాన్  ఇండియా యాక్టర్‌కు నిజ మైన నిర్వచనం ఇదే’’ అన్నారు నాని. దుల్కర్‌ సల్మాన్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. అభిలాష్‌ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘దుల్కర్‌ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్‌ ఉంది.

తన జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు నేను ఫీలవుతున్నాను. ‘సీతారామం’తో తను తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. ఈ సినిమాతో ఆ ప్రేమ నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ పెద్ద విజయం సాధించాలి. ’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ–‘‘దుల్కర్‌ ఓ వైల్డ్‌ యాక్షన్  ఫిల్మ్‌ చేశాడంటే నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు.

దుల్కర్‌ సల్మాన్  మాట్లాడుతూ–‘‘ నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. నాలుగు భాషల్లోనూ నేనే డబ్బింగ్‌ చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో దుల్కర్‌ కొత్తగా కనిపిస్తారు’’ అన్నారు జీ స్టూడియోస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిమ్మకాయల ప్రసాద్‌. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ్స ఐశ్వర్యా లక్ష్మి, అనిఖా సురేంద్రన్ , నటుడు షబ్బీర్, నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)