Breaking News

దుల్కర్ సల్మాన్ కాంతా.. రిలీజ్‌కు ముందే వివాదం..!

Published on Tue, 11/11/2025 - 21:30

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)హీరోగా వస్తోన్న తాజా చిత్రం'కాంతా'(Kaantha). ఈ మూవీకి టాలీవుడ్ హీరో దగ్గుబాటి నిర్మించడంతో పాటు కీలక పాత్రలో నటింటారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే రిలీజ్‌కు ముందే కాంతా మూవీ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రముఖ నటుడు, సంగీతకారుడు త్యాగరాజ భాగవతార్ మనవడు త్యాగరాజన్  చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తాత, దిగ్గజ నటుడు, కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ భాగవతార్‌ను జీవితాంతం పేదరికంలో జీవించిన వ్యక్తిగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. ఆయన చరిత్రను వక్రీకరించేలా తప్పుగా చూపించారని..  త్యాగరాజ భాగవతార్ కీర్తిని అపఖ్యాతి పాలు చేసేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎంకేటీగా ప్రసిద్ధి చెందిన దివంగత భాగవతార్ తమిళ సినిమా, కర్ణాటక సంగీతంలో గౌరవనీయమైన వ్యక్తి అని వెల్లడించారు. ఆయన భక్తి, దాతృత్వానికి ప్రసిద్ధి చెందారని త్యాగరాజన్ పేర్కొన్నారు. ఆయన  మరణించే వరకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సినీ నిర్మాతలు ఎవరైనా ప్రజా ప్రముఖులను తెరపై చిత్రీకరించే ముందు వారి వారసుల నుంచి చట్టపరంగా అనుమతి పొందాలని పిటిషనర్ త్యాగరాజన్ తెలిపారు. ఈ విషయంలో 'కాంతా' మూవీ నిర్మాతలు  విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈ చిత్రం  తన తాత వారసత్వానికి పరువు నష్టం కలిగించేలా ఉందని.. తక్షణమే ఈ సినిమా దాని విడుదలపై నిషేధం విధించాలని కోర్టును కోరారు. ‍అయితే ఈ వివాదంపై నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ కల్పిత కథ అని స్పష్టం చేశారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ పీరియాడికల్ డ్రామాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా.. సముద్రఖని కీలక పాత్ర పోషించారు.
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)