Breaking News

కనీసం కుర్చీ కూడా వేయరు.. బాలీవుడ్‌పై దుల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Tue, 12/02/2025 - 14:45

బాలీవుడ్‌లో స్టార్‌ హీరో అని గుర్తించాలంటే కచ్చితంగా లగ్జరీ కారు ఉండాల్సిందే అంటున్నాడు మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌. మలయాళ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న దుల్కర్‌..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్‌ ఎంట్రీ అనుభవాన్ని పంచుకున్నాడు. హిందీలో స్టార్‌ హీరో అని చూపించుకోకపోతే.. కనీస మర్యాదలు కూడా చేయరని దుల్కర్‌(Dulquer Salmaan) అన్నారు.

బాలీవుడ్‌లో నటించేటప్పుడు నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్లు. నేను సెట్‌లోకి వచ్చినప్పుడు వాళ్లు నన్ను రౌండప్‌ చేసి ఎవరూ దగ్గరకు రాకుండా చూసుకునేవాళ్లు. నేను స్టార్‌ హీరో అని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. అక్కడ స్టార్‌ హీరో అని నిరూపించుకోకపోతే.. కనీసం కూర్చొవడానికి కుర్చీ కూడా వేయరు. మోనిటర్‌ చూడడానికి స్థలం కూడా ఇవ్వరు. చుట్టూ జనాలు..లగ్జరీ కారు ఉంటేనే మనల్ని స్టార్‌ అనుకుంటారు. 

మలయాళంలో అలాంటి పరిస్థితి ఉండదు. సెట్‌కి ఎలా వచ్చినా సరే.. గౌరవిస్తారు. లగ్జరీకి ప్రాధాన్యత ఉండదు. ఇంటి నుంచే అన్నీ తెచ్చుకుంటాం. ఎక్కువ వరకు సొంత ఖర్చులే పెట్టుకుంటాం’ అని దుల్కర్‌ చెప్పుకొచ్చాడు. 2018లో కార్వాన్‌ చిత్రంలో దుల్కర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ  ఇచ్చాడు. ఇటీవల ఆయన ‘కాంత’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)