Breaking News

Drugs Case: పోలీసు కస్టడీకి నిర్మాత కేపీ చౌదరి

Published on Wed, 06/21/2023 - 11:04

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ రాకెట్‌లో ఇటీవల అరెస్ట్‌ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ కేపీ చౌదరి అలియాస్‌ కృష్ణప్రసాద్‌ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు అతన్ని విచారించనున్నారు. డ్రగ్స్‌ విక్రయ కేసులో ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు నిర్మాతను అరెస్ట్‌ చేశారు. వారం రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు.. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. నేడు చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్‌ పోలీసులు కేపీ చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్నారు.

(చదవండి: మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?)

టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌ సినీ ప్రముఖులతో పరిచయం ఉన్న కే.పీ.చౌదరి ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.సినీరంగంలో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఎంచుకున్నారు.

గోవా నుంచి హైదరాబాద్‌కు తరచూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. టాలీవుడ్ ప్రముఖుల తో పాటు , సౌత్ ఆర్టిస్ట్ లతో కేపీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. విచారణలో కేపీ చౌదరి ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్‌ వాడిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అతనితో సన్నిహితంగా ఉన్న టాలీవుడ్‌ ప్రముఖుల్లో గుబులు మొదలైంది. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)