Breaking News

పనోరమా, పెన్‌ స్టూడియోస్‌ ఖాతాలో దృశ్యం–3

Published on Mon, 12/08/2025 - 06:52

నటుడు మోహన్‌లాల్‌ మలయాళంలో కథానాయకుడిగా నటించిన దశ్యం చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటూ తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ  హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దృశ్యం –2 చిత్రం రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దృశ్యం– 3 నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇంతకుముందు రూపొందిన దృశ్యం 1,2 చిత్రాలు విశేష ప్రేక్షకుల ఆదరణ పొందడంతో తాజాగా రూపొందిన దృశ్యం –3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. 

జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆశీర్వాద్‌ సినిమాస్‌ సంస్థ నిర్మించింది. కాగా  పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన  దృశ్యం – 3 చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను, డిజిటల్‌ హక్కులను పనోరమ స్టూడియోస్‌ ,పెన్‌ స్టూడియోస్‌ సంస్థలు కలిసి పొందాయి. ఇంతకు ముందు దృశ్యం – 2 చిత్రాన్ని మనోరమ స్టూడియోస్‌ సంస్థ హిందీలో నిర్మించి  మంచి విజయాన్ని అందుకుందని ఆ సంస్థ అధినేత కుమార్‌ మంగత్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 

కాగా దశ్యం – 3 చిత్రాన్ని పనోరమ స్టూడియోస్‌తో కలిసి విడుదల హక్కులను పొందడం, ఈ చిత్రాన్ని గ్లోబల్‌ ప్లాట్‌ఫారానికి తీసుకువెళ్లడం సంతోషంగా ఉందని పెన్‌ స్టూడియోస్‌ సంస్థ అధినేత డాక్టర్‌ జయంతి లాల్‌ గడ పేర్కొన్నారు. న్యూ సీక్రెట్స్‌తో కూడిన దృశ్యం– 3 చిత్రంతో మళ్లీ పాత మిత్రులందరిని కలవబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉందని నటుడు మోహన్‌లాల్‌ పేర్కొన్నారు. కాగా దృశ్యం సీక్వెల్‌కు అంతమే లేదని దర్శకుడు జీతూ జోసఫ్‌ పేర్కొన్నారు.     

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)