Breaking News

ఎన్టీఆర్‌ డ్రాగన్‌లో టొవినో?

Published on Fri, 01/10/2025 - 04:48

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ అనే ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో మలయాళ నటులు టొవినో థామస్, జోజూ జార్జ్‌ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణీ వసంత్, టొవినో థామస్‌ల లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఈ సినిమా చిత్రీకరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. తొలి షెడ్యూల్‌ను కర్ణాటకలో ప్లాన్‌ చేశారట ప్రశాంత్‌ నీల్‌. ‘డ్రాగన్‌’ మూవీని 2026 జనవరి 9న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక... కెరీర్‌లో యాభైకిపైగా సినిమాల్లో నటించిన టొవినో థామస్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన ‘2018: ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో, 2024లో వచ్చిన ‘ఏఆర్‌ఎమ్‌’ చిత్రాల్లో టొవినో థామస్‌ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్‌ మూవీస్‌గా నిలిచాయి. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)