Breaking News

వెయ్యి కోట్ల స్కామ్‌.. వాళ్ల 'నైట్ పార్టీలకు' వెళ్లిన కయాదు లోహర్

Published on Thu, 05/22/2025 - 16:32

అస్సాం బ్యూటీ కయాదు లోహర్‌ చిక్కుల్లో పడేలా ఉంది. డ్రాగన్ సినిమా విజయంతో  తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో రాత్రికి రాత్రే  సూపర్‌స్టార్‌ అయిపోయిన ఆమెకు ఈడీ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో సంచలనంరేపిన టాస్మాక్‌ కుంభకోణంలో పాల్గొన్న వారు నిర్వహించిన 'నైట్‌ పార్టీ'కి ఆమె వెల్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో ఆమె పాల్గొనేందుకు రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టాస్మాక్‌ కుంభకోణం విషయంలో తమిళనాడు వ్యాప్తంగా కొద్దిరోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కయూదు లోహర్‌ పేరు తెరపైకి వచ్చింది.

టాస్మాక్ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో లోహర్ పేరు బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకుగాను నటికి రూ.35 లక్షలు చెల్లించినట్లు ఒప్పుకున్నారట. అందుకు సంబంధించిన అధారాలు కూడా అందించారట. తమిళనాడు మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్త అక్కడి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ఆరోపణలపై కయాదు లోహర్ ఇంకా స్పందించలేదు.

రూ. 1000 కోట్ల స్కామ్‌
తమిళనాడులో సుమారు రూ. 1000 కోట్లకు పైగా మద్యం స్కామ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణకు ఎంట్రీ ఇచ్చారు. అయితే, టాస్మాక్‌ అధికారులు అందుకు సహకరించకపోవడంతో వారి ఇళ్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నటి కయాదు లోహర్‌ పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. చెన్నైలోని టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేటు మద్యం ఫ్యాక్టరీలు, ప్రభుత్వ ముఖ్య అధికారులు వంటి చోట్ల  ఈడీ సోదాలు చేపట్టింది. ఆపై టాస్మాక్‌లో రూ.1000 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఈడీ తెలిపింది.

సినీ నిర్మాత నివాసంలో సోదాలు
ప్రముఖ సినీ నిర్మాత ఆకాష్‌ భాస్కరన్‌ ఇంట్లో కొద్దిరోజుల క్రితమే ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ స్కామ్‌లో సినిమా పరిశ్రమకు కూడా లింకులు ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. డాన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌ సినిమాలను నిర్మిస్తున్న ఆకాష్‌ భాస్కరన్‌ సహాయ డెరెక్టరుగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. అలా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే, భాస్కరన్‌కు ఉదయనిధికి మధ్య మంచి స్నేహం ఉందని తమిళ మీడియా పేర్కొంటుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)