ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. సన్యాసం ప్లాన్?

Published on Wed, 08/21/2024 - 08:11

ఆగస్టు 15న థియేటర్లలో 'డబుల్ ఇస్మార్ట్' రిలీజైంది. ఎప్పటిలానే పూరీ జగన్నాథ్ మళ్లీ నిరాశపరిచాడు. రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీతో విసుగెత్తించాడు. ఉన్నంతలో హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ షో కాస్త ఎంటర్‌టైన్ చేసింది. తెలుగులో ఇదివరకే పలు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు బ్రేక్ అయితే రాలేదు. తాజాగా ఈమె తన పుట్టినరోజు వేడుకల్ని అనంత్ థామ్ అనే ఆశ్రమంలో సెలబ్రేట్ చేసుకుంది.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)

పుట్టినరోజుని ఆశ్రమంలో చేసుకోవడం పెద్ద విశేషమేం కాదు. కాకపోతే 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్‌కి ముందు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కావ్య థాపర్.. తాను జీవితంలో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నిరోజులకే ఇలా ఆశ్రమంలో కనిపించడం కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలానే ఇన్ స్టాలో స్వామిజీ తనకు తండ్రి లాంటి వారు అని చెబుతూ పెద్ద క్యాప్షన్ పెట్టింది.

తన గురువు అనంత్ బాబా ఆశీస్సులు తీసుకుని కావ్య థాపర్... అక్కడే ఆశ్రమంలోని అనాథలకు, మిగతా వారికి భోజనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేసింది.

పెళ్లి చేసుకోనని చెప్పడం, కుటుంబం ఉన్నా సరే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చూస్తుంటే.. నటిగా కొన్నాళ్లపాటు చేసి, ఆ తర్వాత సన్యాసినిగా మారుతుందేమోనని అనిపిస్తుంది. తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ చేసింది. అలానే గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తీస్తున్న 'విశ్వం' చిత్రంలోనూ ఈమెనే  హీరోయిన్.

(ఇదీ చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని రూ.25 కోట్లకు బేరం పెట్టిన స్టార్ హీరోయిన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)