Breaking News

ప్రమాదంలో చిక్కుకున్న హీరోయిన్‌.. అందుకే నాకు ఛాన్స్‌: నటి

Published on Wed, 07/05/2023 - 14:55

చాలా మంది నటీమణులకు హీరోయిన్‌ కావడానికి మోడలింగ్‌ ఒక మంచి మార్గంగా మారుతుంది. తాజాగా కథానాయికగా అవతారమెత్తిన మోడల్‌ డాలీ ఐశ్వర్య. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 23 గంటల్లో తెరకెక్కించిన కళైంజర్‌ నగర్‌ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం కానుంది. ఆ చిత్రం తర్వాత ఇప్పుడు వరుసగా పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. దీని గురించి డాలీ ఐశ్వర్య తెలుపుతూ నటనపై ఆసక్తి కలగడంతోపాటు నటిగా మారడానికి మోడలింగ్‌ రంగాన్ని మార్గంగా ఎంచుకున్నానని చెప్పింది.

ఇంతకుముందు ఒక షార్ట్‌ ఫిలింలో నటించానని చెప్పింది. ఇక కళైంజర్‌ నగర్‌ చిత్రంలో నటించే అవకాశం అనుకోకుండా వచ్చిందని తెలిపింది. ఈ చిత్రంలో నటించాల్సిన నటి అనుహ్యంగా ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆ అవకాశం తనను వరించిందని పేర్కొంది. రెండో రోజే షూటింగ్‌ అని చెప్పడం, అది 23 గంటల్లోనే రూపొందిస్తున్న రికార్డ్‌ చిత్రం కావడంతో ఇందులో నటించడానికి ఆందోళన చెందానంది. అయితే స్క్రిప్ట్‌ చదవగానే నమ్మకం కలిగిందని పేర్కొంది. ఒకే రోజులో 19 లొకేషన్లలో షూటింగ్‌ను నిర్వహించడంతో ఒక లొకేషన్‌ నుంచి మరో లొకేషన్‌కు మారడానికి 10, 15 నిమిషాలు మాత్రమే సమయం ఉండేది అని చెప్పింది.

యూనివర్సల్‌ జీనియస్‌ అనే రికార్డు కోసం ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది. ఇలా తన తొలి చిత్రమే ఒక రికార్డు చిత్రం కావడం సంతోషంగా ఉందని పేర్కొంది. దీంతోపాటు ఇప్పుడు 2 ఇరైవిల్‌ కంగల్‌ అనే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం, హ్యాపీ బర్త్‌డే జూలీ అనే మరో థ్రిల్లర్‌ కథా చిత్రం, కడైసీ తోట అనే క్రైమ్‌ కథా చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. ఇలా వివిధ నేపథ్యాలతో కూడిన కథా చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ఆనందంగా ఉందని వెల్లడించింది. పెద్ద పెద్ద సంభాషణలు కలిగిన సాహసోపేతమైన కథాచిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది.

చదవండి: చంపేస్తున్నానని బెదిరిస్తున్నాడు: హీరోయిన్‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)