Breaking News

తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్‌

Published on Sat, 06/17/2023 - 21:31

ఇప్పుడు కామెడీ అంటే అన్నీ డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, అవతలివారిని చులకన చేసే జోక్సే కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు స్వచ్ఛమైన కామెడీ కనిపించేది. మాటలతోనే కాదు, హావభావాలతో కూడా కామెడీ పండించేవాళ్లు.  అలాంటి దిగ్గజ హాస్యనటులలో బేత సుధాకర్‌ ఒకరు. ఈ మధ్య ఆయన చనిపోయాడంటూ ఓ పుకారు గుప్పుమనగా తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్‌ చేశాడు సుధాకర్‌. అయితే చాలాకాలం తర్వాత బుల్లితెరపై ఓ షోలో సందడి చేశాడు. ఇందులో కమెడియన్‌ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

పుకార్లు పుట్టించొద్దు
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.  ముందుగా తనపై వచ్చే రూమర్లపై స్పందిస్తూ.. 'నేను చనిపోయానంటూ రూమర్స్‌ పుట్టించారు. నా ఆరోగ్యం బాగుంది. దయచేసి అలాంటి పుకార్లు సృష్టించవద్దు' అని కోరారు. తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. 'నేను వెనక్కు తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో మంచి పాత్రలు చేశాను. హీరో నుంచి కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పని చేశాను. ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా సంతోషంగా చేసేవాడిని. నాకు ఇష్టమైన కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ. నాకు ఇష్టమైన ప్రదేశం ఊటీ. అప్పట్లో బ్రహ్మానందం మా ఇంటికి దగ్గర్లో ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు.

చిరంజీవి పట్టు పట్టడంతోనే..
చిరంజీవి, నేను ఇద్దరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో యముడికి మొగుడు సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టాడు. అలా నేను ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంతో మంచి పేరు వచ్చింది. తమిళనాడులో నాకు ఆస్తులు ఉండేవి, కానీ అమ్మేశాను. తమిళం తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అలా ఇక్కడ సెటిలయ్యాను. నా కొడుకు కూడా త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడు' అని చెప్పుకొచ్చాడు.

సుధాకర్‌ ‍ప్రస్థానం సాగిందిలా..
కాగా 1959 మే 18న జన్మించిన సుధాకర్‌ సినిమాలపై ఆసక్తితో మద్రాస్‌ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్‌లతో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడగా ఆయన సుధాకర్‌ను హీరోగా పెట్టి కిళుక్కెమ్‌ పొగుమ్‌ రెయిల్‌ సినిమా తీశాడు. ఇందులో రాధిక హీరోయిన్‌. ఈ సినిమా హిట్‌ కావడంతో వీరి కాంబినేషన్‌ కూడా రిపీటైంది. తమిళంలో వరుస సినిమాలు చేసిన ఆయన తర్వాత సడన్‌గా రూటు మార్చి తెలుగుపైనే పూర్తిగా దృష్టి సారించాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇక్కడే స్థిరపడిపోయాడు.

చదవండి: స్టార్‌ కమెడియన్‌ సుధాకర్‌ ఇలా అయిపోయాడేంటి?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)