Breaking News

మొదటి 10 నిమిషాల్లోనే ఈ సీన్‌.. ఎవరూ మిస్‌ కాకండి: లోకేశ్‌ కనగరాజ్‌

Published on Sat, 10/14/2023 - 11:24

దసరా బరిలో ఈసారి  మూడు సినిమాలు ప్రధానంగా బరిలో ఉన్నాయి. తెలుగుతో పాటు, తమిళ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'లియో' అక్టోబర్‌ 19న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తి రన్‌ టైమ్‌ 2 గంటల 44 నిమిషాలు కాగా మొత్తం 13 సన్నివేశాల్లో సెన్సార్‌ కోత పెట్టింది. ముఖ్యంగా వాటిలో రక్తం, హింస కనిపించే వంటి సీన్స్‌ తొలగించారు. కానీ ఇవన్నీ కూడా ఒక నిమిషం లోపే ఉన్నాయని సమాచారం.

(ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్‌)

ఇదంతా ఒకపక్క అయితే ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు సినిమా ఎవరూ మిస్ అవ్వకండి అంటూ అలర్ట్ ఇచ్చారు. లియో విజయం కోసం తిరుమలకు విచ్చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పటికే  పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లియో సినిమా ఆడియో ఆవిష్కరణ ఈసారి జరగకపోగా, నటుడు విజయ్ ఇంటర్వ్యూ కూడా చివరి వరకు విడుదల కాకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నటుడు అజిత్ లాగా ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా సినిమా ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి అనే నిర్ణయానికి విజయ్ వచ్చినట్లు సమాచారం.

మొదటి 10 నిమిషాల్లో హైనా సీన్?
లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు ఎవరూ మిస్ కాకూడదని లోకేష్ కనగరాజ్ చెబుతుండగా, గత అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు ఆ 10 నిమిషాల సీన్‌ కోసం సుమారు వెయ్యి మందికి పైగా పనిచేశారని లోకేశ్‌ తెలిపాడు. హైనాతో విజయ్ ఫైట్ చేసిన సీన్‌ అందరినీ మెప్పిస్తుందని ఆయన చెప్పాడు. సినిమాలో తన కుటుంబాన్ని రక్షించడానికి విజయ్‌ ఆ ఫైట్‌ చేసినట్లు సమాచారం. ఈ ఒక్క సీన్‌ కోసం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు కోలీవుడ్‌ ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. ఈ 10 నిమిషాల సీన్‌ అభిమానులను మరొసారి థియేటర్‌కి రప్పించేలా మ్యాజిక్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.

(తమిళ్‌లో నా రెడీ అంటూ.. వచ్చి మంచి హిట్ అయ్యిన సాంగ్ తాజాగా తెలుగులో విడుదల అయింది. ఇక్కడ చూడండి)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)