నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా.. పరిస్థితి విషమం!

Published on Thu, 12/28/2023 - 07:17

తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

డీఎండికే నేత విజయకాంత్‌ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.  గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్‌ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్‌తో ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి.


ఈ క్రమంలో నవంబర్‌ 23న విజయకాంత్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్‌ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)