Breaking News

ది గర్ల్‌ ఫ్రెండ్‌లో రష్మిక కనిపించరు: దీక్షిత్‌ శెట్టి

Published on Tue, 11/04/2025 - 03:08

‘‘మనం ఒకే తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ, కొన్ని సినిమాల్లోని ఫీల్‌ మనతో పాటే ఇంటివరకూ క్యారీ అవుతుంది. అలాంటి సినిమా ఇది. నా కెరీర్‌లో చేసిన మూవీస్‌లో ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ ఉత్తమ చిత్రం అని చెప్పగలను’’ అని దీక్షిత్‌ శెట్టి చెప్పారు. రష్మికా మందన్నా, దీక్షిత్‌ శెట్టి జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.

ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దీక్షిత్‌ శెట్టి మాట్లాడుతూ–‘‘దసరా’ చిత్రం తర్వాత రాహుల్‌ రవీంద్రన్‌గారు నన్ను సంప్రదించి, ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’లో విక్రమ్‌ పాత్రకి నేను సరిపోతానని చెప్పారు. రాహుల్‌గారికి ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్‌ పాత్ర చేయడం సులభం అయ్యింది. ఈ సినిమా కేవలం యువత కోసమే కాదు.. కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో రష్మికగారి నటన చూశాక ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ కి మరో నాయిక న్యాయం చేయలేదేమో? అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు తెరపై రష్మిక కనిపించరు.. ఆమె చేసిన భూమా పాత్ర మాత్రమే కనిపిస్తుంది.

రాహుల్‌ రవీంద్రన్‌ మంచి రైటర్, డైరెక్టర్‌. అంతకంటే మంచి మనిషి.  ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ షూటింగ్‌ టైమ్‌లో అల్లు అరవింద్‌గారు రషెస్‌ చూసి, పిలిస్తే వెళ్లాను. ఆయన నన్ను అభినందించి, తర్వాతి చిత్రానికి అడ్వాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. విద్య, ధీరజ్‌గార్లు మా యూనిట్‌కి కావాల్సినంత సపోర్ట్‌ ఇచ్చారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం మా సినిమాకు హైలైట్‌ అవుతుంది. నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడం నాకు ఇష్టం. అందుకే తెలుగు భాషని కూడా నేర్చుకున్నాను. విక్రమ్‌ పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పాను.

బాగా నటిస్తే భాషతో సంబంధం లేకుండా ఆయా నటీనటులను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘దసరా’ చిత్రం నుంచి హీరో నానిగారితో నా అనుబంధం కొనసాగుతోంది. ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ టీజర్, ట్రైలర్‌ బాగున్నాయంటూ ఆయన ప్రశంసించడం సంతోషం. ఇక నేను కన్నడలో నటించిన ‘బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి’ సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబనా, కేజేక్యూ’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నా. కన్నడలో శివ రాజ్‌కుమార్‌గారితో కలిసి ఓ మూవీ చేస్తున్నా. మలయాళంలో నటించిన ‘ఏంజెల్‌ నెం.16’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాను’’ అని తెలిపారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)