Breaking News

బతికేందుకు చెత్త సేకరించి అమ్మాను: బుల్లితెర నటి

Published on Wed, 04/10/2024 - 18:42

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి దహియా. యే హై మొహబ్బతేన్ సీరియల్‌తో ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్‌లో నటిస్తోంది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యాంక తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇ‍బ్బందులు పడినట్లు తెలిపింది. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశానని వెల్లడించింది. 

దివ్యాంక మాట్లాడుతూ.. ' ప్రతి ఒక్కరూ మీపై మీరే ఆశలు పెంచుకోవాలి. మన లక్ష‍్యం కోసం ఎప్పటికీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మన మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి. గతంలో నేను టూత్‌పేస్ట్‌ పెట్టెలను సేకరించి అమ్మేదాన్ని. వాటికి ఒక్కో బాక్స్‌కు రూపాయి ఇచ్చేవారు. అలా సేకరించిన వాటిని భద్రంగా దాచి చెత్త సేకరించే వారికి అమ్మాను. అలా డబ్బు సంపాదించి నా పెట్‌ డాగ్ కోసం ఆహారం, బిల్లులు చెల్లించేదాన్ని. అప్పట్లో నా సర్వైవల్ కోసం రూ. 2 వేలు వచ్చినా ఫర్వాలేదు. అలా నా రోజువారీ జీవితం ప్రారంభయ్యేది. ఎవరైనా సరే డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి' అంటూ సలహాలు ఇస్తోంది బుల్లితెర భామ

.కాగా.. దివ్యాంక ప్రస్తుతం బాలీవుడ్‌ బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంక ఈజాజ్ ఖాన్ సరసన అదృష్టమ్ అనే చిత్రంలో నటిస్తోంది.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)