Breaking News

ప్రేమకథను కొత్తగా చెప్పాను: దర్శకుడు విశ్వ కరుణ్‌

Published on Mon, 03/10/2025 - 03:33

కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్‌ రుబా’(Dil Ruba). ఈ చిత్రంలో రుక్సార్‌ థిల్లాన్, నజియా డేవిసన్‌ హీరోయిన్లు. విశ్వ కరుణ్‌(Vishwa Karun) దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్‌ రెడ్డిలతో కలిసి సారెగమ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వ కరుణ్‌ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ‘దిల్‌ రుబా’ అనే ప్రేమకథను రెడీ చేసి, కిరణ్‌ అబ్బవరంగారికి వినిపించాను. ఆయన ఓకే అన్నారు.

ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్‌ డ్రివెన్‌ ఫిల్మ్‌ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్‌’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.

అలాగే ఊరికే కోపం రాకూడదు... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడు. ఈ అంశం కూడా సినిమాలో ఉంది. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్‌ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని మార్పులు చేశాం. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను’’ అని అన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)