Breaking News

మహేశ్ బాబు, నేను కలిసి క్వశ్చన్‌ పేపర్ కొనేవాళ్లం: టాలీవుడ్ డైరెక్టర్

Published on Thu, 01/30/2025 - 19:33

ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం ప్రేమిస్తావా. ఈ మూవీని పంజా ఫేం విష్ణు వర్ధన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ  రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్  సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్‌ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్‌ మహేశ్ బాబు ఓకే స్కూల్లో చదివినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన బెంచ్‌మేట్‌ అయిన ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. మహేశ్‌ బాబుతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..'  మహేశ్‌ బాబుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం బెంచ్‌మేట్స్. ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి. కొన్నింటిని బయటికే చెప్పలేం. మేము చెన్నైలో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్‌ స్టూడెంట్‌. బిలో యావరేజ్ అనుకోండి. మహేశ్‌ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పా. నేను వెంటనే మహేశ్‌ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లా. కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ ‍అయితే దొరకలేదు. అన్నీ ఫేక్. మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబు సినిమా తీస్తా' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 
 

 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)