Breaking News

నయనతార భర్త.. ప్రభుత్వ భూమిపై కన్నేశాడా?

Published on Mon, 12/16/2024 - 13:47

హీరోయిన్ నయనతార రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలేం చేయలేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం వివాదాలు. కొన్నాళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో పెద్ద గొడవే పెట్టుకుంది. ఇందులో నయన్ భర్త విఘ్నేశ్ కూడా ఉన్నాడు.  ఇప్పుడు ఇతడిపై షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఏకంగా ప్రభుత్వ భూముల్నే కొనేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇప్పుడు దీనిపై స్వయంగా విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.

దర్శకుడు విఘ్నేశ్ శివన్.. ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖామంత్రిని కలిసి వచ్చాడు. అయితే పుదుచ్చేరి బీచ్ రోడ్‌లో ప్రభుత్వానికి చెందిన సీగల్ హోటల్‌ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో విఘ్నేశ్ ఉన్నాడని ప్రచారం మొదలైంది. అందుకే స్వయంగా సీఎంని కలిసి వచ్చాడనే పుకారు వచ్చింది. కానీ ప్రభుత్వ ఆస్తిని అమ్మడం కుదరదని పర్యాటక శాఖామంత్రి చెప్పడంతో విఘ్నేశ్ తిరిగొచ్చేశాడని మాట్లాడుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్ల అన్ని అబద్ధాలే అని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నాడు. తన పాండిచ్చేరి పర్యటన వెనకున్న కారణాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. 'నా సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ అనుమతి తీసుకునేందుకు అక్కడికి వెళ్ళాను. గౌరవ మర్యాదలతో ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖా మంత్రిని కలిశాను. అనుకోకుండా, నాతో పాటు వచ్చిన లోకల్ మేనేజర్.. నా మీటింగ్ తర్వాత దేని గురించో వాళ్ళతో మాట్లాడారు. దీంతో ఆ చర్చ నాకోసమే అని పొరబడుతున్నారు. వస్తున్న రూమర్స్ ఏవి నిజం కాదు' అని విఘ్నేష్ శివన్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

'నానుమ్ రౌడీ దానే' సినిమాతో దర్శకుడిగా మారిన విఘ్నేశ్ శివన్.. తొలి మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. మధ్యలో నయన్‪‌ని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మువీ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లు.

(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)