Breaking News

ధనుష్‌తో సినిమా.. స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఇష్టం లేదన్న బన్నీ!

Published on Wed, 04/12/2023 - 18:06

తమిళ చిత్రం విడుదల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సైతం సినిమా చాలా బాగుందంటూ చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ సూపర్‌ హిట్‌ మూవీని వెట్రిమారన్‌ డైరెక్ట్‌ చేశాడు. ఆడుకాలం, కాక ముట్టై, విసరణై, వడ చెన్నై, అసురన్‌ వంటి ఎన్నో హిట్స్‌ను కోలీవుడ్‌కు అందించిన ఆయన త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది. స్ట్రయిట్‌ ఫిలిం ఏమో కానీ ఇప్పుడైతే విడుదలను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేయబోతున్నారు.


దర్శకుడు వెట్రిమారన్‌

విడుదల పార్ట్‌ 1 తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్న సందర్భంగా వెట్రిమారన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నేను సినిమా చేయాలనుకున్నాను. ఈమేరకు చర్చలు కూడా జరిగాయి. నేను తీసిన ఆడుకాలం(తెలుగులో పందెంకోళ్లుగా రీమేక్‌ అయింది) సినిమా రిలీజయ్యాక చెన్నైలో అల్లు అర్జున్‌ నన్ను కలిశాడు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇద్దామనుకుంటున్నా. నీకు ఇంట్రస్ట్‌ ఉంటే మంచి కథ రాయు అన్నాడు. అప్పుడు వడ చెన్నై స్క్రిప్ట్‌ చెప్పా. హీరో ధనుష్‌ను ఢీ కొట్టే రోల్‌ ఆఫర్‌ చేశా. హైదరాబాద్‌కు వచ్చి గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌లో ఆ పాత్ర గురించి వివరంగా చెప్పాను. కానీ మరొక హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పాడు' అని వెల్లడించాడు.

ఇకపోతే విడుదల సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 15న విడుదల కానుంది. ఇందులో కమెడియన్‌ సూరి హీరోగా నటించగా విజయ్‌ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ సినిమాకోసం పనిచేసిన తన శిష్యులు 25 మందికి తలా ఓ ప్లాట్‌ బహుమతిగా కొనిచ్చాడు వెట్రిమారన్‌. అలాగే చిత్రయూనిట్‌ అందరికీ తలా ఒక బంగారు నాణాన్ని బహుమతిగా ఇచ్చాడు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)