Breaking News

‘అన్నపూరణి ’ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయం సరైనది కాదు: వెట్రిమారన్‌

Published on Wed, 01/17/2024 - 10:39

అన్నపూరణి చిత్రం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అన్నపూరణి. ఇది ఆమె నటించిన 75వ చిత్రం కావడం గమనార్హం. నీలేష్‌ కృష్ణ ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. నటుడు జయ్‌, సత్యరాజ్‌, రెడిన్‌కింగ్స్‌లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం గత డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో గోడకు కొట్టిన బంతిలా అన్నపూరణి చిత్రం ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆవిధంగా నైనా సేఫ్‌ అవుదాం అనుకుంటే వివాదాల్లో చిక్కుకుంది.

చిత్రంలోని శ్రీరాముడు కూడా మాంసం భుజించారు అన్న సంభాషణ అన్నపూరిణి చిత్రాన్ని చిక్కుల్లో పడేసింది. ఈ చిత్రం ఒక సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ ఇది లవ్‌ జిహాద్‌ను ఆదరించే చిత్రంగా ఉందంటూ ముంబైకి చెందిన శివసేన పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్‌ సోలంకి ముంబై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది లేనిపోని వివాదాలకు తెచ్చిపెట్టే విధంగా ఉందని భావించిన నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ అన్నపూరణి చిత్ర స్ట్రీమింగ్‌ను నిలిపేసింది. అయితే దీనిపై పలువురు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు వెట్రిమారన్‌ కూడా అన్నపూరణి చిత్ర విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ చర్యలను తప్పు పట్టారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన ఒక చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ నుంచి తొలగించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదన్నారు. ఒక చిత్రాన్ని అనుమతించడానికై నా, నిషేధించడానికి అయినా సెన్సార్‌ బోర్డుకు మాత్రమే అధికారం ఉందన్నారు. అలాంటిది ఇప్పుడు జరిగిన ఘటన సెన్సార్‌ బోర్డు అధికారాన్నే ప్రశ్నార్థకంగా మార్చే విధంగా ఉందన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)