Breaking News

రజనీకాంత్‌తో ఛాన్స్‌.. నెల్సన్‌ తన్నుకుపోయాడు: వెంకట్‌ ప్రభు

Published on Fri, 08/16/2024 - 07:53

కోలీవుడ్‌ స్టార్‌ హీరో రజనీకాంత్‌తో తనకు దక్కిన అవకాశాన్ని దర్శకుడు నెల్సన్‌ తన్నుకుపోయారని దర్శకుడు వెంకట్‌ప్రభు పేర్కొన్నారు. సీనియర్‌ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్‌ వారసుడు వెంకట్‌ప్రభు. 'చెన్నై 28'  చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఈయన తరువాత చెన్నై 28–2, మంగాత్తా, గోవా, మానాడు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. నటుడుగా, నిర్మాతగానూ కొనసాగుతున్న  వెంకట్‌ప్రభు తాజాగా విజయ్‌ కథానాయకుడిగా గోట్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. 

కాగా ఇటీవల ఈయన ఓ భేటీలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. తాను రజనీకాంత్‌ కథానాయకుడిగా చిత్రం చేయాలని ఆశించాననీ, అందుకు కథను కూడా సిద్ధం చేసి ఆయనకు వినిపించానని చెప్పారు. రజనీకాంత్‌కు కూడా కథ నచ్చిందన్నారు. దీంతో రజనీకాంత్‌తో చిత్రం చేయడం ఖాయం అయ్యిందన్నారు. అయితే చివరి క్షణంలో రజనీకాంత్‌తో చిత్రం చేసే అవకాశాన్ని దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తన్నుకుపోయారని, అలా తనకు రజనీకాంత్‌తో చిత్రం చేసే అవకాశం మిస్‌ అయ్యిందని చెప్పారు. 

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌  నటుడు రజనీకాంత్‌తో చిత్రం చేయడం సంతోషమేననే అభిప్రాయాన్ని వెంకట్‌ప్రభు వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా గోట్‌ చిత్రం తరువాత ఈయన నటుడు శివకార్తికేయన్‌ హీరోగా ఓ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.  రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో జైలర్‌ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)