Breaking News

నాగార్జున సినిమాతో నా కెరియరే పోయింది: డైరెక్టర్‌

Published on Fri, 06/09/2023 - 17:13

టాలీవుడ్‌ దర్శకుడు వీరభద్రం చౌదరి, ఆహనా పెళ్ళంట, పూలరంగడు సినిమాలతో పరిచయం అయ్యాడు. అవి రెండూ ప్రేక్షకులను మెప్పించి విజయాన్ని అందుకున్నాయి. అలా సక్సస్‌ఫుల్‌గా వీరభద్రం జర్నీ కొనసాగుతున్న సమయంలో  అక్కినేని నాగార్జున 'భాయ్‌' సినిమాకు దర్శకత్వం వహించాడు. స్వయంగా నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పైనే నిర్మించాడు. తర్వాత హీరో ఆదితో 'చుట్టాలబ్బాయి' సినిమాకు ప్లాన్‌ చేసినా.. అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

(ఇదీ చదవండి: ప్రియుడితో నిర్మాత కూతురి పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వీరభద్రం తన కెరియర్‌ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. 'నాగార్జునతో తీసిన 'భాయ్‌' సినిమా మొదట కామెడీ నేపథ్యంలో తీయాలని కథ రాసుకున్నాను. కానీ పెద్ద హీరో అనేసరికి స్క్రిప్ట్‌లో మార్పులు చెయాల్సి వచ్చింది. దీంతో ఎక్కడో మిస్ ఫైర్ అయింది. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో నాకు కోలుకోలేని దెబ్బ పడింది. విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని ఒక్కసారిగా కిందకు తోసేస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఒక రకంగా నేను ఇలాంటి స్థితికి వచ్చానంటే నాగార్జున సినిమానే కారణమని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత  పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను' అని వీరభద్రం చౌదరి చేసిన  కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో నిర్మాతగా ఉన్న నాగార్జునకు భారీగానే నష్టాలు వచ్చాయి. ఒక సినిమా ప్లాప్‌ అయినా.. హిట్ అయినా పూర్తి బాధ్యత దర్శకుడిదే అని వీరభద్రం  తెలిపాడు.

(ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)