Breaking News

వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!

Published on Fri, 01/12/2024 - 18:26

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ కొందరి దర్శకులకు కూడా కల్ట్ అభిమానులున్నారు. వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్‌లో చూడొచ్చు. ఆయన పెన్ పవర్ అలాంటిది. కానీ తాజాగా 'గుంటూరు కారం' మూవీతో వచ్చిన గురూజీ.. చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలామంది అంటున్నారు. ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుతప్పుతున్నట్లు అనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: న్యూ ఇయర్‌కి థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి)

డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది. అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తుంది.

ఫస్ట్ 'గుంటూరు కారం'నే తీసుకుందాం. ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే ఈమెతే ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

(ఇదీ చదవండి: Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ)

ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీటైంది. 'అరవింద సమేత'లో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్‌గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. 

త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లని కాకుండా కాస్త గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని సగటు సిని ప్రేమికుడు అనుకుంటున్నాడు. 

(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)