Breaking News

చిరంజీవితో ఛాన్స్‌ వచ్చిందని మాకు హ్యాండిచ్చాడు: డైరెక్టర్‌

Published on Sun, 08/18/2024 - 06:58

కోలీవుడ్‌ టాప్‌స్టార్‌ ప్రశాంత్‌ చాలా గ్యాప్‌ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం అందగన్‌. తాజాగా తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాలీవుడ్‌ హిట్‌ సినిమా అంధాధున్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసింది. ఇందులో నటి సిమ్రాన్‌, ప్రియా ఆనంద్‌, కార్తీక్‌, యోగిబాబు, సముద్రఖని, ఊర్వశీ,కేఎస్‌.రవికుమార్‌, వనితా విజయ్‌కుమార్‌ నటించారు.

ఈ చిత్రాన్ని స్టార్‌ మూవీస్‌ పతాకంపై శాంతి త్యాగరాజన్‌ నిర్మించగా, త్యాగరాజన్‌ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి టాక్‌ రావడంతో ఈ చిత్ర థ్యాంక్స్‌ గివింగ్‌ సమావేశాన్ని  చైన్నెలో మేకర్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు త్యాగరాజన్‌ మాట్లాడుతూ అందగన్‌ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలన్నారు. పాజిటివ్‌ రివ్యూలే చిత్ర విజయానికి కారణం అన్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ కథానాయకుడు అయినా , అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. ఈ చిత్రానికి ముందుగా మోహన్‌రాజాను దర్శకుడిగా ఎంపిక చేశామని, మూడు నెలలు చర్చలు జరిగిన తరువాత ఆయన తెలుగులో చిరంజీవితో చిత్రం చేసే అవకాశం రావడంతో వెళ్లిపోయారన్నారు. దీంతో తానే దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. 

చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్‌ వస్తే ఎవరూ వదులుకోలేరని, దీంతో ఆ విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు. మోహన్‌రాజా-చిరంజీవి కాంబినేషన్‌లో గాడ్‌ఫాదర్‌ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై హీరో ప్రశాంత్‌ పెళ్లి టాపిక్‌ కూడా వచ్చింది. అందుకు బదులిచ్చిన త్యాగరాజన్‌ అందగన్‌ చిత్రం మంచి హిట్‌ అయ్యిందని, ఇక సినిమా విషయాలను పక్కన పెట్టి ప్రశాంత్‌ పెళ్లి పైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు, త్వరలోనే మంచి అమ్మయితో ప్రశాంత్‌ పెళ్లి ఉంటుందని చెప్పారు. 

కాగా నటుడు ప్రశాంత్‌ మాట్లాడుతూ అందగన్‌ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు త్యాగరాజన్‌, నటీనటులని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు కమ్‌ బ్యాక్‌ అనీ, ఇకపై చాలా చిత్రాలు చేస్తానని ఆయన అన్నారు. తొలి ముద్దు, జోడి, జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు