Breaking News

ఆ యాడ్‌తో టుక్‌ టుక్‌ ఆలోచన వచ్చింది: సి.సుప్రీత్‌ కృష్ణ

Published on Tue, 03/18/2025 - 01:32

‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్‌ టుక్‌’ సినిమా చేశాను. మ్యాజికల్‌ పవర్స్‌ ఉన్న ‘టుక్‌ టుక్‌’ అనే వెహికల్‌ హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్  మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్‌ సి.సుప్రీత్‌ కృష్ణ(Supreet Krishna) చెప్పారు.

హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్  మధు, సాన్వీ మేఘన, నిహాల్‌ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘టుక్‌ టుక్‌’. ఆర్‌వైజీ సినిమాస్‌ పతాకంపై రాహుల్‌ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్‌ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు.

పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీప్రాజెక్ట్‌ చేశాను. ‘టుక్‌ టుక్‌’ నా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌. క్రికెట్‌ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్‌ టుక్‌’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్‌ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్‌ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్‌ అయితే ‘టుక్‌ టుక్‌’ ఫ్రాంచైజీ ప్లాన్  ఉంది’’ అన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)