Breaking News

ఆ విషయాన్ని నిజాయతీగా చెప్పాను: సుబ్బు మంగాదేవి

Published on Sun, 12/08/2024 - 03:58

‘బచ్చల మల్లి’ మూవీ క్యారెక్టర్‌ బేస్డ్‌ కథ. ఇందులో తండ్రికి సంబంధించిన భావోద్వేగ అంశాలు ప్రధానంగా ఉంటాయి. కరోనా టైమ్‌లో నా తల్లిని  కోల్పోయాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. జీవితంలో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పులు మూర్ఖత్వంతో చేయొద్దనే విషయాన్ని చాలా నిజాయతీగా చెప్పాను’’ అని డైరెక్టర్‌ సుబ్బు మంగాదేవి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, అమృతా అయ్యర్‌ జంటగా నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ మూవీ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు.

ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా సుబ్బు మంగాదేవి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘రాజేష్‌ దండాగారికి నేను చెప్పిన ‘బచ్చల మల్లి’ కథ నచ్చడంతో, నరేశ్‌గారికి చెప్పమన్నారు. కథ విన్న నరేశ్‌గారు వెంటనే సినిమా చేద్దామన్నారు. ‘పుష్ప 1’లో అల్లు అర్జున్‌గారిది కూలీ పాత్ర. ఇందులో బచ్చల మల్లి అనే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా చేశారు నరేశ్‌గారు.

అలా ఆయన గెటప్‌ విషయంలో ΄ోలిక తప్ప కథ విషయంలో కాదు. ‘బచ్చల మల్లి’ కథని ఎమోషనల్‌గా చెప్పాలనుకున్నాం. ఇందులో మంచి ప్రేమకథ ఉంది. నేను 1990లలో ఊర్లో పెరిగాను. అప్పటి మనుషులు ఎలా ప్రవర్తించేవారో నాకు తెలుసు. అందుకే 1990 నేపథ్యంలో ఈ కథ చెప్పాలనుకున్నాను. బచ్చల మల్లి పాత్రకి నరేశ్‌గారు పూర్తి న్యాయం చేశారు. నా తర్వాతిప్రాజెక్ట్స్‌ కోసం కొన్ని స్టోరీ లైన్స్‌ ఉన్నాయి. ‘బచ్చల మల్లి’ రిలీజ్‌ తర్వాత వాటిపై దృష్టి పెడతాను’’ అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)