Breaking News

‘ఆదికేశవ' ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతాడు: దర్శకుడు

Published on Thu, 11/23/2023 - 17:31

ఓ మంచి కథతో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు నా సన్నిహితులతో చెబితా..  మంచి కమర్షియల్ ఫిల్మ్‌ చేయమని సూచించారు. అప్పుడు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశాను.. అదే ఆదికేశవ.ఈ సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రం.. ఈ శుక్రవారం(నవంబర్‌ 24) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు.. 

►హైదరాబాద్ లో ఉండే ఒక సాధారణ కుర్రాడు.. ఎక్కడో అనంతపురం దగ్గరున్న కళ్యాణదుర్గంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా లో చూస్తారు.

►భీమ్లా నాయక్ సెట్స్ కి వెళ్ళి వంశీ గారికి  ఈ కథ చెప్పగా ఆయనకి నచ్చింది. ఆ తర్వాత చినబాబు గారికి, వైష్ణవ్  తేజ్ గారికి కథ చెప్పాను. అందరికీ నచ్చింది. అలా సితార సంస్థ తో దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది .

►ఏ రోజూ కూడా వంశీ గారు ఇంత బడ్జెట్ లో తీయమని నాకు చెప్పలేదు. కొత్త దర్శకుడివి నువ్వు, నీకు డబ్బుల గురించి ఆలోచన వద్దని చెప్పారు. సినిమా కోసం నేను అడిగినవన్నీ సమకూర్చి పెట్టారు. మంచి మంచి నటీనటులను ఇచ్చారు. బడ్జెట్, పారితోషికం ఇలాంటి పట్టించుకోకుండా నా దృష్టి అంతా సినిమా చిత్రీకరణ మీద ఉండేలా చూశారు.

►క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చివరి 45 నిమిషాలు అద్భుతంగా ఉందని ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎడిటర్ నవీన్ నూలి గారు కూడా చివరి 45 నిమిషాలు అదిరిపోయింది అన్నారు. డీఐ టైంలో ఈ సినిమా చూస్తూ ఎమోషనల్ అయినవాళ్ళు ఉన్నారు. సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఖచ్చితంగా ఈ సినిమా ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది.

►జి.వి. ప్రకాష్ గారి అనుభవం చాలా హెల్ప్ అయింది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఇచ్చారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)