Breaking News

ఐదుగురు బ్యాచిలర్స్‌ కథ

Published on Wed, 08/06/2025 - 00:16

‘‘కథపై నమ్మకంతో ‘బకాసుర రెస్టారెంట్‌’(Bakasura Restaurant Movie) సినిమా చేశాం. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేని రోజులు ఇవి. అందుకే మేం మేకింగ్‌ పరంగా ఖర్చుపెట్టాం. కంటెంట్‌ బాగుంటే సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. అలా మా చిత్రం కూడా విజయం సాధి స్తుంది’’ అని దర్శకుడు ఎస్‌జే శివ తెలిపారు. ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో, ‘వైవా’ హర్ష టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే మూవీస్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థిన్  ఆచారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఎస్‌జే శివ మాట్లాడుతూ–‘‘లండన్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశాను. ‘విరూపాక్ష’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. గతంలో మా నాన్నగారు కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన ఆకాంక్ష మేరకే నేను దర్శకుడిగా, అన్నయ్య నిర్మాతగా మారాం. కొత్త తరహా జోనర్‌లో హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘బకాసుర రెస్టారెంట్‌’ తీశాం.

గతంలో ప్రేక్షకులను అలరించిన ‘యమలీల, ఘటోత్కచుడు’ సినిమాల్లా ఆడియన్స్ ని థ్రిల్లింగ్‌కు గురిచేసే సినిమా ఇది. ఐదుగురు బ్యాచిలర్స్‌ మధ్య జరిగే వినోదాత్మక కథ. మన జీవితంలోకి ఓ తిండిపోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి? అనేది పాయింట్‌. నా కొత్త సినిమా నా బ్యానర్‌లో ఉండదు. కొత్త దర్శకులను పరిచయం కోసమే ఎస్‌జే మూవీస్‌ని ప్రారంభించాం’’ అన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)