పిల్లలు లేని కపుల్స్‌ మా సినిమా చూసి ఇబ్బంది పడరు

Published on Sun, 11/09/2025 - 10:46

‘‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో ప్రేమకథ ఉంటుంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ఓ చిన్న సమస్యను కూడా చూపించాం’’ అని డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి(Sanjeev Reddy ) చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంజీవ్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో ఫెర్టిలిటీ ఇష్యూస్‌ ఉన్నాయి. 

మేల్‌ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటిదాకా తెలుగులో ఏ మూవీ రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ కొందరు ఇలాంటి ఇష్యూస్‌తో బాధపడ్డారు. వారికి ఆధునిక వైద్యంతో పిల్లలు పుట్టినప్పటికీ వారు సొసైటీ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్‌ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్‌ రెడీ చేశాను. 

ఇలా నేను చూసిన సమస్యతోనే ఈ సినిమా చేశాను. విక్రాంత్‌కి ఈ కథ బాగా నచ్చింది. ఫెర్టి లిటీ ఇష్యూ అనేది మాట్లాడకూడని అంశం కాదు... సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య. మా సినిమాని చూసేందుకు పిల్లలు లేని కపుల్స్‌గానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ గానీ ఇబ్బంది పడరు. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే ఫెర్టిలిటీ అంశాన్ని మా సినిమా చూశాక బహిరంగంగా మాట్లా డతారని అనుకుంటున్నాం’’ అని చెప్పారు.  

 

Videos

సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!

పశువులను చంపి.. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం

జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

న్యాయం అడిగితే కేసులు పెడతారా ? అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు

ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి మంగళం?

ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV

జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..

ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం

చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)