Breaking News

‘లవ్ డేస్’ హిట్‌ కావాలి: దర్శకుడు సముద్ర

Published on Sat, 11/29/2025 - 15:38

నవీన్, కుసుమ చందక జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథల్లా ఈ ‘లవ్ డేస్’ నిలిచిపోతుంది. ‘లవ్ డేస్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఈ మూవీ జీవితంలో ఎన్నో మెమోరీస్‌ను అందించాలని కోరుకుంటున్నాను. మనస్పూర్తిగా ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత మాదల వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘సురేష్ లంకలపల్లి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రయాణంలో అతని డెడికేషన్ నాకు చాలా నచ్చింది. ఆయనతోనే మళ్లీ నెక్ట్స్ సినిమా కూడా చేయబోతోన్నాం. భవిష్యత్తులో కూడా ఆయనతో సినిమాలు చేస్తాను. నేను చేయనున్న నాలుగో సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారు. నవీన్, కుసుమ, ఆదిత్య ఇలా అందరూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. మా మూవీ టైటిల్, గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.

దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ .. ‘నిర్మాత వెంకట్ గారి వల్లే ఈ కథ, ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. నవీన్ కటౌట్ బాగుంటుంది. కుసుమకి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆదిత్యకి తెలుగు అంతగా రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పాడు. ఈ మూవీలో ప్రతీ ఒక్కరి పాత్ర బాగుంటుంది’ అన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)