Breaking News

ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం: సంపత్‌ నంది

Published on Tue, 04/15/2025 - 00:21

‘‘రచ్చ, బెంగాల్‌ టైగర్, గౌతమ్‌ నంద’.. ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నేను ‘ఓదెల 2’లాంటి కథ రాస్తాననుకోలేదు. నా భార్య మా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి ఎనిమిదేళ్లుగా పూజలు చేస్తోంది. మా నానమ్మ శివశక్తిగా ఉండేవారు. అప్పట్లో నేను కొన్ని సంఘటలను మా ఊర్లో గమనించాను. నా మనసులో ఉన్న అవన్నీ ‘ఓదెల 2’ రూపంలో బయటకు వచ్చాయి’’ అని దర్శక– నిర్మాత, రచయిత సంపత్‌ నంది అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా సంపత్‌ నంది మాట్లాడుతూ–‘‘అశోక్‌ తేజని డైరెక్టర్‌ చేయాలని ‘ఓదెల రైల్వేస్టేషన్స్ ’ మూవీ తీశాం. ఆహా ఓటీటీలో విడుదలైన ఆ మూవీ చాలా సక్సెస్‌ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ చేస్తే బాగుంటుందన్నట్లుగా అశోక్‌ తేజ చెప్పాడు. ఓ సారి భీమ్స్‌తో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ చేస్తున్నప్పుడు సీక్వెల్‌ క్రియేట్‌ చేయవచ్చనిఅనిపించింది. తొలిపార్టులో రాధ క్యారెక్టర్‌ హైలైట్‌ అవుతుంది. సీక్వెల్‌లో మరో ఫీమేల్‌ క్యారెక్టర్‌ అయితే బలంగా ఉంటుందని శివశక్తి పాత్రకు తమన్నాగారిని తీసుకున్నాం. ఆత్మకు, పరమాత్మకు మధ్య జరిగే యుద్ధమే ‘ఓదెల 2’.

ఓ పంచాక్షరి మంత్రంతో నాగసాధువు శివశక్తి.. ఓ ప్రేతాత్మను ఎలా కంట్రోల్‌ చేసింది? అన్నదే కథాంశం. ‘అరుంధతి’ సినిమాతో మా చిత్రానికి పోలిక లేదు. నిర్మాత రాధామోహన్స్ గారికి ‘ఓదెల 2’ కథ చెప్పాను. ఆ సమయంలో ఆయన హిందీ మూవీతో బిజీగా ఉండటంతో డి.మధుగారు నిర్మించారు. సాంకేతిక నిపుణులకు డబ్బు ముఖ్యం కాదు.. ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం. ‘ఓదెల 3’ కి అవకాశం ఉంది. నా దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ పీరియాడికల్‌ ఫిల్మ్‌ రానుంది. దర్శకుడిగా నాకు కొంత గ్యాప్‌ వచ్చింది. కానీ.. మరో ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేలా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)