Breaking News

తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌

Published on Tue, 04/29/2025 - 08:00

చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్‌ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్‌ ఇచ్చిన హీరోయిన్స్‌కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్‌ కనిపించకుండా పోయారు. అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్‌ హిట్‌ అయితే, మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు.

హీరో శర్వానంద్‌(Sharwanand) కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది.  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్‌నంది దర్శకత్వం వహించనున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో  అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్‌ హయాతిని  దర్శకుడు సంపత్‌నంది  ఎంపిక చేశారు. 2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు. ఈ గ్యాప్‌లో రోజూ జిమ్‌కు వెళ్లి తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్‌గా అయింది. రెగ్యూలర్‌గా తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వచ్చింది. అలా ఇప్పడు ఛాన్సులు దక్కించుకుంది.

1960లో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్‌ ప్రకటించారు. షూటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)