Breaking News

కుటుంబ ప్రేక్షకులు రావడం మాకు ఆశ్చర్యం: శైలేష్‌ కొలను

Published on Sun, 05/04/2025 - 03:02

‘‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ సినిమాకి ఒక వర్గం ప్రేక్షకులే వస్తారనుకున్నాం. గత రెండు రోజులుగా థియేటర్స్‌ విజిట్‌ చేస్తున్నాం. చాలామంది మహిళలు  రావడం గమనించాం. నానీగారిని అర్జున్‌ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి ఎగ్జైట్‌మెంట్‌తో వస్తున్నారనిపించింది. మా అంచనాలను దాటి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందన సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది’’ అని శైలేష్‌ కొలను చెప్పారు. నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. యునానిమస్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌ పోస్టర్‌ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల1న విడుదలైంది. ఈ సందర్భంగా శైలేష్‌ కొలను చెప్పిన విశేషాలు...

∙‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో అర్జున్‌ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్‌ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్‌ సర్కార్‌ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. డార్క్‌ వెబ్‌ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్‌ డిపార్ట్‌మెంట్‌ దీని మీద వర్క్‌ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్‌ వెబ్‌ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు. 

∙‘హిట్‌ 3’ క్లైమాక్స్‌లో అడివి శేష్‌ కనిపిస్తారు. విశ్వక్‌ సేన్‌ని ఇంకా బిగ్గర్‌ కాన్వాస్‌లో చూపించాలనే ఈ మూవీలో చేయించలేదు. ‘హిట్‌ 6’ లేదా ‘హిట్‌ 7’లో అందరి హీరోల్ని ఒక ఫ్రేమ్‌లోకి తీసుకురావాలని ఉంది.

∙‘హిట్‌ 4’లో హీరో కార్తీగారు నటిస్తారు. ఆ పాత్ర రూడ్‌గా, ఫన్‌గా ఉంటుంది. ఇక నాలో ఉన్న వినోదాన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చేలా ఓ రొమాంటిక్‌ కామెడీ స్టోరీ రాయాలని ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)