Breaking News

పూర్ణతో నాకు లవ్‌ ఎఫైర్‌ ఉంది.. కానీ.. : రవిబాబు

Published on Thu, 04/13/2023 - 18:38

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలు తీయడంలో రవిబాబు దిట్ట. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ హీరోయిన్‌గా కనిపిస్తుంది. రవిబాబు వరుసగా ఆమెతో సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు చేసేవి. అదంతా ఏమీ లేదని రవిబాబు గతంలో రూమర్స్‌ను కొట్టిపారేసినప్పటికీ ఆ వదంతుల ప్రచారం ఆగలేదు. తాజాగా రవిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన అసలు మూవీలోనూ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పూర్ణతో రిలేషన్‌షిప్‌పై స్పందించాడు రవిబాబు.

ఆయన మాట్లాడుతూ.. 'పూర్ణతో నాకు లవ్‌ ఎఫైర్‌ ఉంది. అలా అన్నానని ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది. దర్శకుడు చెప్పినదానికంటే పూర్ణ 200 శాతం యాడ్‌ చేసి నటిస్తుంది. నా సినిమాల్లో హీరోయిన్‌ అనగానే అందరికీ మొదట పూర్ణ గుర్తొస్తుంది. కానీ ఆమె కొన్నింటినే ఓకే చేస్తుంది. మరికొన్నింటికి నో చెప్తుంది. ఈ మధ్య నా కొత్త సినిమా వాషింగ్‌ మెషీన్‌ కోసం ఆమెను సంప్రదించాను. తను నిర్మొహమాటంగా చేయనని చెప్పేసింది. తను ఒక పాత్రకు సరిగ్గా సరిపోతాను అనుకుంటే మాత్రమే నటిస్తుంది. అంతేతప్ప నాకోసం ప్రత్యేకంగా ఒప్పుకోదు. అలా ఒప్పుకోకూడదు కూడా! అందువల్లే ఆమెకు నచ్చిన సినిమాల్లోనే పూర్ణ నటించింది' అని రవిబాబు చెప్పుకొచ్చాడు.

కాగా హిట్‌ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సెలక్టెడ్‌గా సినిమాలు చేసే రవిబాబు అనసూయ, అవును సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2, లడ్డుబాబు, అదుగో సినిమాల్లో పూర్ణ ప్రధాన పాత్రలు పోషించింది. సీమటపాకాయ్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైనప్పటికీ అవును సినిమాతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అఖండ, దసరా చిత్రాల్లోనూ పూర్ణ ముఖ్య పాత్రలు పోషించింది. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)