Breaking News

సంక్రాంతికి నా సినిమా రావడం సంతోషం

Published on Sat, 01/10/2026 - 04:26

‘‘చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది డైరెక్టర్‌గా తొలిసారి సంక్రాంతికి నా సినిమా రావడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అని రామ్‌ అబ్బరాజు చెప్పారు. శర్వానంద్‌ హీరోగా సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా  నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా రామ్‌ అబ్బరాజు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘శర్వానంద్‌గారి ‘బైకర్‌’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడటంతో మాకు సంక్రాంతికి వచ్చే చాన్స్‌ దొరికింది. నేను తీసిన ‘వివాహ భోజనంబు, సామజవరగమన’ లానే ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ‘రన్‌ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, మహానుభావుడు..’ వంటి వినోదాత్మక చిత్రాల తర్వాత శర్వానంద్‌గారు చేసిన ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది.

 ఈ చిత్రంలో మంచి అతిథి పాత్ర ఉంది.. శ్రీవిష్ణుగారిని అడిగిన వెంటనే చేశారు. నా తర్వాతి సినిమాని శ్రీవిష్ణుగారితో క్రైమ్‌ కామెడీ జోనర్‌లో చేస్తున్నాను. నా ప్రతి సినిమాకి భాను, నందు రైటర్స్‌గా ఉన్నారు. ఇకపైనా ఇలానే కొనసాగుతుంది. ఇండస్ట్రీలో రచయితల కొరత ఉందనేది వాస్తవమే. చాలామంది డైరెక్టర్‌ అవ్వాలని ఇండస్ట్రీకి వస్తారు. కాక΄ోతే కొందరు రైటర్‌గా కొన్నాళ్లు చేసి, ఆ తర్వాత డైరెక్టర్‌ ప్రయత్నాలు చేస్తారు. నేను కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానే వచ్చాను. గుణశేఖర్‌గారి ‘నిప్పు’ సినిమాకి పని చేశాను’’ అని చెప్పారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)