Breaking News

డేవిడ్ వార్నర్‌కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్

Published on Tue, 07/29/2025 - 12:28

డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే పేరుకే ఆస్ట్రేలియా క్రికెటర్ గానీ తెలుగు సినిమాలంటే మామూలు ప్రేమ కాదు. ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టుకు ఆడినప్పటి నుంచి ఈ ప్రేమ మొదలైంది. ఇక లాక్ డౌన్‌లో అప్పటి టాలీవుడ్ హిట్ సాంగ్స్ అన్నింటికీ రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసి తెగ వైరల్ అయిపోయాడు.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)

ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతానికి వార్నర్ క్రికెట్ ఆడట్లేదు. కొన్నాళ్ల క్రితమే అంతర్జాతీయ కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈ క్రమంలోనే గతంలో తీసుకున్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. 'హాయ్ వార్నర్, మహిస్మతి రాజులా మారాల్సిన సమయం ఆసన్నమైంది. రాయల్ హెల్మెట్ నీకు పంపిస్తా' అని చెప్పారు. స్పందించిన వార్నర్.. 'యెస్ ప్లీజ్ సర్' అని రిప్లై ఇచ్చాడు.

గతంలో రాజమౌళి-వార్నర్ కలిసి ఓ ప్రమోషనల్ యాడ్‌లో నటించారు. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య బాండింగ్ కొనసాగుతున్నట్లు ఉంది. ఇప్పుడు వార్నర్‌కి రాజమౌళి గిఫ్ట్ ఇస్తానని మాట ఇవ్వడం లాంటివి చూస్తుంటే రీ రిలీజ్ సందర్భంగా అంతర్జాతీయంగానూ 'బాహుబలి'ని ప్రమోట్ చేసేందుకు వార్నర్‌తో కలిసి పెద్ద ప్లానే వేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబరులో 'బాహుబలి' రెండు భాగాల్ని కలిపి ఓ పార్ట్‪‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)