Breaking News

'అదంతా పీఆర్ స్టంట్‌' .. నెటిజన్‌కు ది గర్ల్‌ఫ్రెండ్‌ డైరెక్టర్‌ స్ట్రాంగ్ కౌంటర్!

Published on Fri, 11/14/2025 - 20:03

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్ఫ్రెండ్‌. చిత్రంలో రష్మిక మందన్నా లీడ్రోల్లో కనిపించింది. దీక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన లవ్ ఎంట్ర్టైనర్బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ. 20.4 కోట్లు గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్గా.. ప్రొఫెషనల్గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. దీంతో ది గర్ల్ఫ్రెండ్మూవీ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ది గర్ల్ఫ్రెండ్ మూవీ టీమ్ సక్సెస్మీట్ కూడా నిర్వహించింది.

అయితే ఇటీవల ది గర్ల్ఫ్రెండ్మూవీ థియేటర్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమా చూసిన అమ్మాయి డైరెక్టక్రాహుల్ను చూసి అభినందనలు తెలిపింది. సందర్భంగా తన దుపట్టా తీసి గర్వంగా తిరుగుతానంటూ చేసి చూపించింది. వీడియో కాస్తా నెట్టింట వైరలైంది. దీంతో అమ్మాయిని మెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ఒక హగ్ ఇచ్చాడు. అయితే ఇదంతా చూసిన నెటిజన్అంతా పీఆర్ స్టంట్అని ట్రోల్ చేశాడు. కేవలం దుపట్టా, హగ్‌ కోసమే అమ్మాయికి డబ్బులిచ్చి అలా చేయించారా? అంటూ విమర్శించాడు. ఇది చూసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్స్పందించాడు. ట్విటర్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు.

అమ్మాయిపై నెగెటివిటీ రాకూడదనే ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశాడు. కానీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను ఖండించాల్సి అవసరముందన్నారు. ఈ థియేటర్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు ఎక్కడికి వెళ్లాలో మేము కచ్చితంగా డిసైడ్అవ్వలేదన్నారు. థియేటర్కు మేము వెళ్తామో కూడా చివరికి వరకు మాకే తెలియదని రాసుకొచ్చాడు. ఇందులో ఎలాంటి పీఆర్స్టంట్ లేదని.. అది పూర్తిగా యాదృఛ్చికం అని రవీంద్రన్ట్వీటిర్లో పోస్ట్ చేశారు.

రాహుల్ రవీంద్రన్తన ట్వీట్లో రాస్తూ..' ఆ వీడియోను బయట పెట్టడం గురించి నేను కొంచెం ఆందోళన చెందా. కొందరు అమ్మాయిని ట్రోల్ చేస్తారని భయపడ్డా. ఇప్పుడు అమ్మాయి పట్ల నాకు భయంగా ఉంది. ఆమెకు చాలా బలంగా, ధైర్యంగా నిలబడాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ద్వారా వారి చున్నీలను తీయమని నేను చెప్పడం లేదు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం. ఒక అమ్మాయి తన దుపట్టాను యాదృచ్ఛికంగా తీయడం వల్ల ఓ వర్గం ప్రజలు బాధపడుతున్నారు. ఇది మన సంస్కృతిని కాపాడుకోవడం అనే చాలా పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది' అని పోస్ట్ చేశారు.

ఇంకా ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి వారం ఎవరైనా పురుషులు ఓ యాక్షన్ సన్నివేశానికి ముందు తమ చొక్కాలు చింపివేసినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని నేను ఆశ్చర్యపోతున్నా. నేను ఒకరిని ప్రేరేపించాలని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం పక్షపాత ధోరణిని మాత్రమే ప్రశ్నిస్తున్నా. సంతోషంగా ఉన్నప్పుడు సెలబ్రేట్చేసుకోవడం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ నా ముఖంలో చిరునవ్వును తెప్పిస్తుంది. కానీ ఇక్కడ మన సంస్కృతిని కాపాడుకునే భారాన్ని ఓ వర్గం మన మహిళల భుజాలపై మాత్రమే ఎందుకు మోపింది? చాలామంది ప్రతిరోజూ ధోతీల కట్టుకుని  ఎందుకు తిరగడం లేదు? వారు ప్యాంటుకు ఎందుకు మారారు? వారిలో చాలామంది ఇంగ్లీషులో ఎందుకు ట్వీట్ చేస్తారు? అన్నింటికంటే, వారు మన సంస్కృతిని కాపాడుకోవడం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు కదా? ఇలాంటి ప్రశ్నలు తెలివితక్కువవిగా, చిరాకు తెప్పించే అపరిపక్వంగా అనిపిస్తాయి కదా. అలాంటప్పుడు వారు మహిళలను వేరే ప్రమాణాలకు అనుగుణంగా ఎందుకు ఉంచుతున్నారు? దీనికి నా దగ్గర సమాధానాలు లేవు. ది గర్ల్ఫ్రెండ్ లాంటి సినిమా ఈ రోజు సందర్భోచితంగా ఉందా? అవసరమా? అని నన్ను అడిగే కొద్ది మంది మాత్రమే ఈ చిత్రానికి వస్తున్న ప్రతిస్పందనలను గమనిస్తున్నారని ఆశిస్తున్నా. ఇక్కడే వారికి సమాధానం దొరుకుతుంది' అని నెటిజన్కు గట్టిగానే రిప్లై ఇచ్చేశాడు.

 

 

Videos

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

నాపేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించారు:సజ్జనార్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)