Breaking News

‘పరదా’ చర్చనీయాంశమవుతుంది: ప్రవీణ్‌ కాండ్రేగుల.

Published on Sun, 08/17/2025 - 08:05

‘‘పరదా’ కోసం మేం సృష్టించిన ఊరు, సంస్కృతి, పాత్రలన్నీ కల్పితాలే. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా సినిమాకు అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. అయితే డబ్బులు వస్తే, ఈ తరహా చిత్రాలను నిర్మించేందుకు మరింతమంది నిర్మాతలు ముందుకొస్తారు. అందుకని వసూళ్లు బాగుండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రవీణ్‌ కాండ్రేగుల. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ శ్రీధర్‌ మక్కువతో కలిసి విజయ్‌ డొంకడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రవీణ్‌ మాట్లాడుతూ–‘‘నా తొలి చిత్రం ‘సినిమా బండి’కి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేసిన విజయ్‌గారికి ‘పరదా’ కథ చెప్పగా, ఎగ్జైట్‌ అయ్యారు. ఆ తర్వాత అనుపమ గారికి కథ వినిపించగా ఎమోషనల్‌ అయ్యారు. ఆ నెక్ట్స్‌ దర్శన, సంగీతగారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఓ ఊర్లో మహిళలందరూ ఎందుకు పరదాలు ధరిస్తారనే విషయాన్ని సినిమా స్టార్టింగ్‌లోనే చెప్పాం. ఆడవాళ్లలోనే కాదు... మగవాళ్లల్లో కూడా ఒక పరదా ఉంటుందని ఈ ‘పరదా’తో చెప్పే ప్రయత్నం చేశాం.

 ‘హైవే’ సినిమాలో ఆలియా భట్‌గారి నటకు నేను పెద్ద అభిమానిని. ‘పరదా’లో ఆలియా స్థాయి నటను అనుపమ చేశారు. దర్శన, సంగీతగార్లు బాగా యాక్ట్‌ చేశారు. గోపీసుందర్‌గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. మృదుల్‌ సేన్‌ అనే అమ్మాయి అద్భుతమైన విజువల్స్‌ను అందించారు. ‘సినిమాబండి, శుభం, పరదా’లాంటి డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్న నాకు కమర్షియల్‌ సినిమాలపై కూడా మంచి గ్రిప్‌ ఉంది. చాన్స్‌ వస్తే పెద్ద హీరోలతో కమర్షియల్‌ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి